¡Sorpréndeme!

RR vs CSK Match Preview IPL 2025 | నేడు గువహాటిలో చెన్నసూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ | ABP Desam

2025-03-30 0 Dailymotion

 చెన్నై మొన్న బెంగుళూరు మీద ఓడిపోయిన విధానాన్ని ఏ చెన్నై అభిమానీ మర్చిపోలేడు. 197 పరుగుల టార్గెట్ ఛేజ్ చేయటం కోసం బరిలోకి దిగిన CSK బ్యాటర్లంతా చేతులెత్తేసి ఆర్సీబీకి 50పరుగుల విజయంతో పాటు 17ఏళ్ల తర్వాత చెపాక్ లో విక్టరీ అందించారు. ఆ విషయం కంటే చెన్నైను భాదపెట్టిన మరో అంశం. MS Dhoni బ్యాటింగ్ ఆర్డర్ గురించి. ఆర్సీబీ మ్యాచ్ లో వికెట్లు పడిపోతుంటే ముందొచ్చి గెలిపిస్తాడు అనుకుంటే 9 వ స్థానంలో దిగి తీవ్ర విమర్శలు పాలయ్యాడు ధోని. ఆడే ఉద్దేశం లేనప్పుడు రిటైర్మెంట్ ఇచ్చొయొచ్చుగా తలా అంటూ లోయల్ ఫ్యాన్స్ కూడా వైల్డ్ గా రియాక్ట్ అయ్యారు. సరే అదేదో అయిపోయింది ఈ మ్యాచ్ లో ధోని ఏం చేయనున్నాడనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్. టీమ్ అవసరాల దృష్ట్ర్యా తను ఉన్నతం కాలం 4h or 5th డౌన్ లో బ్యాటింగ్ కి రావాలన్న వీరేంద్ర సెహ్వాగ్ లాంటి ఆటగాళ్ల సలహాలు సూచనలు ధోనీ పాటిస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు సంజూ శాంసన్ గాయం కారణంగా RR కూడా చాలా వీక్ గా మారిపోయింది. కెప్టెన్ రియాన్ పరాగ్ అనుభవలేమి కెప్టెన్సీలో స్ఫష్టంగా కనిపిస్తోంది. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి కేవలం బ్యాటింగ్ మాత్రమే ఆడుతున్న సంజూ శాంసన్ ఈ మ్యాచ్ లో అదే రిపీట్ చేసే అవకాశం ఉంది. చూడాలి మరి RR అద్భుతమైన విజయం సాధించిన కంబ్యాక్ ఇస్తుందా. లేదా చెన్నైకి విక్టరీని అందించి ఆర్సీబీ షాక్ నుంచి కోలుకునే లా చేస్తుందా ఈ రోజు నైట్ కి తేలిపోనుంది.